- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా వందేమాతర గేయం 150వ వార్షికోత్సవంపైనే చర్చ జరిగింది. నేడు రాజ్యసభలో ‘వందేమాతరం’ పై సభా నేత జె.పి నడ్డా ప్రసంగించనున్నారు. మతపరమైన శక్తుల ఒత్తిడితో వందేమాతరంను మార్చడానికి నెహ్రూ బాధ్యత తీసుకున్నారని జె.పి నడ్డా ఆరోపించారు. ఇక లోక్‌సభలో సమాజ్‌వాది పార్టీ ఎంపి కల్గే శివాజీ బండప్పా ఉత్తరప్రదేశ్‌లో టెట్ పరీక్షను నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు. రాజ్యసభలో వందేమాతరంపై చర్చ ముగిసిన తర్వాత ఎన్నికల సంస్కరణలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
- Advertisement -



