Sunday, July 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅప్పులు, అధిక వడ్డీలు గుదిబండగా మారాయి

అప్పులు, అధిక వడ్డీలు గుదిబండగా మారాయి

- Advertisement -

– వాటి చెల్లింపులకే ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి వస్తోంది
– ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మెన్‌తో సీఎం రేవంత్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
: అప్పులు, అధిక వడ్డీలు తమ ప్రభుత్వానికి గుదిబండగా మారాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోందనీ, చెల్లింపులకు కష్టమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీల చెల్లింపుల కోసమే ఖజానా నుంచి అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోయారు. అందువల్ల అధిక వడ్డీకి తీసుకున్న రుణాలపైన వడ్డీలను తగ్గించుకోవటానికి ప్రయత్ని స్తున్నామని తెలిపారు. ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి చైర్మెన్‌ ఎస్‌.మహేంద్రదేవ్‌ శనివారం హైదరాబాద్‌ లో సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిరువురూ పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం… మహేంద్ర దేవ్‌కు వివరించారు. సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించు కోవాలి, సహకరించుకోవాలని రేవంత్‌ కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామనీ, రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవారంగం అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులకు సముచితమైన అవకాశాలు కల్పిస్తేనే రాష్టానికి కంపెనీలు వస్తాయనే విషయాన్ని
ప్రస్తావించారు. హైదరాబాద్‌ చుట్టూ రీజినల్‌ రింగ్‌ రోడ్‌ నిర్మిస్తామనీ, దీనికి అనుసంధానంగా రేడియల్‌ రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా కూడా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -