– యూఎస్‌లో ఇప్పటికే విక్రయం
– డెక్కన్ గ్రెయింజ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ పోలా వెల్లడి
హైదరాబాద్ : డెక్కన్ బ్రాండ్ పేరుతో రైస్ ఎగుమతుల్లో ఉన్న డెక్కన్ గ్రెయింజ్ ఇండియా తాజాగా చైనాలోకి అడుగుపెట్టినట్టు ప్రకటించింది. ఇప్పటికే స్వీడన్, బ్రిటన్, జర్మనీ, ఐర్లాండ్, లండన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఈయూ, టర్కీలో 30 రకాల భారతీయ రైస్‌ను పరిచయం చేసినట్లు పేర్కొంది. ఈ స్థాయిలో విదేశీ గడ్డపై విస్తరించిన ఏకైక దక్షిణ భారత బ్రాండ్‌గా స్థానం సంపాదించామని డెక్కన్ గ్రెయింజ్ ఇండియా డైరెక్టర్ కిరణ్ కుమార్ పోలా తెలిపారు. బియ్యం ఉత్పత్తిలో భారత్ తర్వాత ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచిన చైనాలో కంపెనీ ప్రవేశించడవం కీలక మైలురాయిగా అభివర్ణించారు. యూఎస్ మార్కెట్లో నాన్ బాస్మతి రైస్ విభాగంలో డెక్కన్ ఫుడ్స్ నంబర్ వన్ స్థానం కైవసం చేసుకున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లోని వేలాది మంది రైతుల నుంచి నాణ్యమైన బియ్యం కొనుగోలు చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు వివరించారు. దశాబ్దంన్నర ప్రయాణంలో కంపెనీ 7 కోట్లకుపైగా బ్యాగ్స్‌ను విదేశాల్లో విక్రయిం చామన్నారు. 2026 ప్రారంభంలో డెక్కన్ గ్రెయింజ్ భారత్‌లోనూ విక్రయాలను ప్రారంభించనుందని కిరణ్ కుమార్ తెలిపారు.
చైనాలోకి ‘డెక్కన్’ రైస్ ప్రవేశం
- Advertisement -
- Advertisement -