Friday, February 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాంకేతిక యుగంలో తగ్గుతున్న పుస్తక పఠనం..

సాంకేతిక యుగంలో తగ్గుతున్న పుస్తక పఠనం..

- Advertisement -

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
నేటి సాంకేతిక యుగంలో యంత్రాల వాడకం పెరిగి. పుస్తకాలు చదవడం తగ్గు తోందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు, డాక్టర్. ఏనుగు నరసింహా రెడ్డి అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో పిల్లల వైద్య నిపుణుడు గుండ్లూరు సురేంద్రబాబు తెలుగులో రచించిన ‘పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు’ పుస్తకం ఆంగ్లానువాదం ’18 ప్రిన్సిపుల్స్ ఫర్ సక్సెస్ ఇన్ ఎగ్జామ్’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఈ పుస్తకం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శనం చేస్తుందన్నారు. వ్యక్తిత్వవికాస నిపుణుడు ఆకెళ్ల రాఘవేంద్ర మాట్లాడుతూ.. చదువంటే కేవలం మార్కులే కాదు.. నిజమైన విజ్ఞానాన్ని తెలుసుకోవడమన్నారు. పుస్తక రచయిత డాక్టర్ సురేంద్రబాబు మాట్లాడుతూ.. తెలివైన పిల్లలు ఎందుకు భయపడుతున్నారు? శక్తి ఉన్నా ధైర్యం ఎందుకు తగ్గిపోతోంది? ఎంత కష్టపడినా నమ్మకం ఎందుకు తగ్గిపోతోంది? అనే ఆలోచనలే పుస్తకాన్ని రాసేలా చేసిందన్నారు. సామాజిక సమరసతా వేదిక కన్వీనర్ అప్పాల ప్రజాద్, ప్రొ. త్రివేణి, సినీ రచయిత డా. పెద్దింటి అశోక్ కుమార్,, శ్రీ భాష్యం శ్రావణ్ కుమార్ ,  విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -