ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌పై డా.ప్రతాని రామకష్ణ గౌడ్, పి. అశోకుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘దీక్ష’. ఆర్ కె గౌడ్ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో, హీరోయిన్స్‌గా ఆక్స ఖాన్, తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రమిది.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. జూన్ నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగు తున్నాయి. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత డా. ప్రతాని రామకష్ణ గౌడ్ మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే మంచి పాయింట్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాం. అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకున్నాం. అలాగే మైథలాజికల్‌ను జోడించి నిర్మిస్తున్న ఈ చిత్రంలో భీముడు పాత్రలో హీరో కిరణ్ అద్భుతంగా నటించాడు. ఆక్స ఖాన్ స్పెషల్ సాంగ్‌లో, తనదైన శైలిలో డాన్స్ ఆదరగొట్టింది. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అద్భుతమైన 5 పాటలు అందించారు. ఆర్ ఆర్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. ఈ చిత్రంలో 5 ఫైట్స్ ఉన్నాయి. రోహిత్ శర్మను విలన్ క్యారెక్టర్‌తో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మా బ్యానర్‌లో రాబోతున్న 41వ చిత్రమిది. దీని తర్వాత ‘కబడ్డీ’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాం’ అని తెలిపారు.
‘ఆర్‌కె గౌడ్ ఎంతోమంది కొత్త నటీనటులను ఎంకరేజ్ చేశారు. అందులో నేను కూడా ఉండటం అదష్టంగా భావిస్తున్నా. ఆయన డైరెక్షన్‌లో హీరోగా నటించడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను’ అని హీరో కిరణ్ చెప్పారు.
జూన్‌లో ‘దీక్ష’ విడుదలకు సిద్ధం
- Advertisement -
- Advertisement -