Friday, September 26, 2025
E-PAPER
Homeజాతీయంతీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్, మరాఠీ టెలివిజన్ సీరియల్స్ ద్వారా పాపులారిటీ పొందిన నటుడు ఆశిష్ వారంగ్ కన్నుమూశారు. గతేడాది డిసెంబర్ నుంచి జాండీస్‌తో బాధపడుతున్న ఆయన.. ఈ మధ్య ఆకస్మిక అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఈ వార్త విన్న ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. కాగా ఆశిష్ వారంగ్ బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, అమీర్, అజయ్ దేవ్‌గణ్, రణవీర్ సింగ్, రోహిత్ శెట్టి లాంటి ప్రముఖులతో కలిసి పనిచేశాడు. ఆయన చివరగా సంజయ్ నిరంజన్ డైరెక్షన్‌లో వచ్చిన ‘బాంబే’ చిత్రంలో నటించారు. ‘సూర్యవంశీ’, ‘దృశ్యం’, ‘మర్దానీ’, ‘సింబా’, ‘సర్కస్’, ఏక్ విలన్ రిటర్న్స్’ లాంటి చిత్రాల్లో పాత్రల ద్వారా అభిమానుల మనసులో చెరగని ముద్ర వేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -