Thursday, October 23, 2025
E-PAPER
Homeజాతీయంతీవ్ర విషాదం.. అధికార పార్టీ ఎమ్మెల్యే కన్నుమూత

తీవ్ర విషాదం.. అధికార పార్టీ ఎమ్మెల్యే కన్నుమూత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అధికార డీఎంకే పార్టీకి చెందిన సెంతమంగళం నియోజకవర్గ ఎమ్మెల్యే కె.పొన్నుసామి (74) ఇవాళ కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఉండగా.. పొన్నుసామికి అకస్మాత్తుగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం వెంటనే కొల్లిమలైలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ప్రాథమిక చికిత్స అందజేసి మెరుగైన చికిత్స కోసం నామక్కల్‌లోని ఓ ప్రయివేటు ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే పొన్నుసామిని పరీక్షించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లుగా ధృవీకరించారు. అయితే, ఎమ్మెల్యే పొన్నుస్వామి ఆకస్మిక మరణం పట్ల సీఎం స్టాలిన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రతిపక్ష నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. 2006 నుంచి సెంతమంగళం నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు పోటీ చేసిన పొన్నుసామి 2006, 2021లో రెండుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -