- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఛఠ్ పూజ వేళ ఝార్ఖండ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హజారీబాగ్, గర్హ్వా జిల్లాల్లో ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. హజారీబాగ్‌లోని కెరెదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని బేలా గ్రామంలో.. ఛఠ్ పూజ వేడుకల సందర్భంగా ఇద్దరు బాలికలు గుంగున్ కుమారి(11), రూపా తివారీ(12) చెరువులో మునిగిపోయారు. అలాగే గర్హ్వా జిల్లాలో సోమవారం మధ్యాహ్నం డాన్రో నదిలో స్నానం చేస్తూ రాహుల్ కుమార్(3) అనే బాలుడు నీటిలో మునిగి మరణించాడు.
- Advertisement -



