Friday, May 30, 2025
E-PAPER
Homeజాతీయంమ‌రో దేశీయ ఎయిర్ క్రాప్ట్‌ల ఉత్ప‌త్తికి ర‌క్ష‌ణ శాఖ ఆమోదం

మ‌రో దేశీయ ఎయిర్ క్రాప్ట్‌ల ఉత్ప‌త్తికి ర‌క్ష‌ణ శాఖ ఆమోదం

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: అడ్వాన్స్ డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాప్ట్ లను (అమ్కా) దేశీయంగా ఉత్పత్తి చేయడానికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అనుమతి మంజూరు చేశారు. పరిశ్రమ భాగస్వామ్యంతో ఉత్పత్తి కార్యక్రమాన్ని ఏరోనాటికల్ డెవెలప్ మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో స్వదేశీ నైపుణ్యాల వినియోగంలో కీలక మైలురాయిగా ఈ ఉత్పత్తి ప్రక్రియ మారనుంది. ఎగ్జిక్యూషన్ మోడల్ విధానం ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు పోటీ ప్రాతిపదికన సమాన అవకాశాలను లభించనున్నాయి. స్వతంత్రంగా లేదా జాయింట్ వెంచర్‌లుగా లేక కన్సార్టియాగా బిడ్ చేయవచ్చు. ఎంటిటీ/బిడ్డర్ దేశ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఉండే భారతీయ కంపెనీ అయి ఉండాలి అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -