Saturday, December 13, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్దేఖ్‌లేంగే సాలా..‘ఉస్తాద్‌’ పాట వచ్చేసింది

దేఖ్‌లేంగే సాలా..‘ఉస్తాద్‌’ పాట వచ్చేసింది

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే పాటలతో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ‘దేఖ్‌లేంగే సాలా.. చూసినాము చాలా’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో పవన్‌ వేసిన స్టెప్‌లు అభిమానులతో విజిల్స్‌ వేయించేలా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు భాస్కర్‌ భట్ల సాహిత్యం అందించారు. విశాల్‌ ధడ్లానీ ఆలపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -