– డైరెక్టర్ పార్ధసారధి పిర్యాదు పై విచారణ..
– రాతపూర్వక ఫిర్యాదుకు రైతులు విముఖత…
నవతెలంగాణ – అశ్వారావుపేట : నెలలు తరబడి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు,అడపాదడపా పడుతున్న వానలతో వడ్లు వానలకు తుడవడం పై ధాన్యం కొనుగోళ్ళు,తరలింపులో తీవ్ర జాప్యం ఉంటుందని,దీంతో రైతులు నష్టపోతున్నారని అశ్వారావుపేట పీఏసీఎస్ డైరెక్టర్ డీసీఓ ఖుర్షీద్ కు ఇటీవల పిర్యాదు చేసారు.
ఆయన ఆదేశానుసారం మోనట్రింగ్ అధికారి వీరేశం బాబు శుక్రవారం స్థానిక పరపతి సంఘం కార్యాలయంలో విచారించారు.
స్థానిక పీఏసీఎస్ అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ సమక్షంలో విచారణ చేపట్టగా పిర్యాదు పార్ధసారధి మరికొందరు రైతులు హాజరయ్యారు.అయితే కొందరు రైతులు ధాన్యం కొనుగోలు,తరలింపు జాప్యం పై మౌఖికంగా మాత్రమే పిర్యాదు చేసారు.రాతపూర్వక ఫిర్యాదుకు విముఖత చూపడం విశేషం.
పిర్యాదు దారుడు,డైరెక్టర్ పార్ధసారధి మాత్రం విచారణ పై అసంతృప్తి వ్యక్తం చేసారు.నేను పిర్యాదు చేసిన అంశాలు కాకుండా పై పై రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం ఇక్కట్లు మొక్కుబడిగా కార్యాలయం కూర్చుని వివరాలు సేకరించారు అని క్షేత్రస్థాయిలో పరిశీలన చెయ్యలేదని తెలిపారు.
విచారణ కు వచ్చిన కో ఆపరేటివ్ మోనట్రింగ్ అధికారి వీరేశం బాబు మాట్లాడుతూ పిర్యాదు దారుల్లో పార్ధసారధి ఒక్కరు మాత్రమే హాజరయ్యారు అని,మిగతా రైతులు రాతపూర్వక పిర్యాదు ఇవ్వలేదని,ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేసి,తరలిస్తే చాలు అని పలువురు రైతులు తెలిపారు అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లు చంద్రశేఖర్ తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు,తరలింపులో జాప్యం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES