నవతెలంగాణ-హైదారాబాద్: కర్నాటకలో ఓ దంపతుల మధ్య లోన్ చిచ్చుపెట్టింది. దావణగెరె మండలం మంతరఘట్ట గ్రామానికి చెందిన భార్యభర్తలు విద్య-విజయ్ ఓ సంస్థలో కొంత మొత్తంలో లోన్ తీసుకున్నారు. ఈక్రమంలో పలు దఫాలుగా తీసుకున్న అప్పుకు సకాలంలో వాయిదాలో పద్ధతిలో నగదు చెల్లిస్తున్నారు. అయితే ఈనెల 8న నగదు చెల్లింపులో జాప్యం జరగడంతో..ఆగ్రహించిన భర్త విజయ్ భార్యను పలు రోజులుగా హింసిస్తున్నాడు. తాజాగా ఇవాళ జరిగిన గొడవలో ఆమె ముక్కుపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయమైంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు భర్త విజయ్‌ను పోలీసులుఅరెస్ట్ చేశారు.
లోన్ చెల్లింపులో జాప్యం..భార్య ముక్కుపై దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES