Sunday, November 9, 2025
E-PAPER
Homeజాతీయంరెడ్‌జోన్‌లో ఢిల్లీ వాయు కాలుష్యం

రెడ్‌జోన్‌లో ఢిల్లీ వాయు కాలుష్యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శనివారం అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (AQI) 400 స్థాయిని దాటడంతో.. నగరం రెడ్‌జోన్ లోకి వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ఇక ఆదివారం కూడా అదే ప‌రిస్థితి కొన‌సాగింది. సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్ర‌కారం.. ఇవాళ ఉద‌యం ఢిల్లీ – ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఓవ‌రాల్ ఏక్యూఐ 361గా న‌మోదైంది. కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్య‌త ప్ర‌మాద‌క‌ర‌స్థాయిలో కొన‌సాగుతోంది.

వ‌జీర్‌పూర్‌లో ఏక్యూఐ లెవెల్స్ 424గా న‌మోద‌య్యాయి. బ‌వానాలో 424, వివేక్ విహార్‌లో 415, రోహిణి ప్రాంతంలో 435, నెహ్రూ న‌గ‌ర్‌లో 426, ఆర్‌కేపురంలో 422, ఐటీవో ప్రాంతంలో 420, నోయిడాలో 391, గ్రేట‌ర్ నోయిడాలో 366, ఘ‌జియాబాద్‌లో 387, గురుగ్రామ్‌లో 252గా గాలి నాణ్య‌త సూచిక న‌మోదైంది. గాలి కాలుష్యానికి తోడు ఢిల్లీని ద‌ట్ట‌మైన పొగ క‌మ్మేసింది. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. గాలి కాలుష్యం ప్ర‌మాద‌క‌ర‌స్థాయిలో ఉండ‌టంతో రాజ‌ధాని రెడ్‌జోన్‌లోనే కొన‌సాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -