Thursday, November 20, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ పేలుళ్లు..మ‌రో న‌లుగురు అరెస్ట్

ఢిల్లీ పేలుళ్లు..మ‌రో న‌లుగురు అరెస్ట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులను శ్రీనగర్‌లో NIA అరెస్ట్ చేసింది. దీంతో ఈ దాడితో సంబంధం ఉన్న మొత్తం అరెస్టులు 6కి పెరిగాయి. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తోన్న సంగతి తెలిసిందే.

కాగా, ఈ పేలుడు ఘటన జరిగిన వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనిపై దర్యాప్తును ఎన్ఐఏ కి అప్పగించింది. దాడికి కారణమైన గ్రూపులోని ప్రతి సభ్యుడిని గుర్తించి అరెస్టు చేయడానికి ఏజెన్సీ వివిధ రాష్ట్ర పోలీసు దళాలతో కలిసి పనిచేస్తోంది. నవంబర్ 10న ఢిల్లీలోని నేతాజీ సుభాష్ మార్గ్‌లో ముష్కరమూకలు జరిపిన పేలుడులో 15 మంది మరణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -