Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఢిల్లీ సీఎంకు Z-కేట‌గిరి భ‌ద్ర‌త‌

ఢిల్లీ సీఎంకు Z-కేట‌గిరి భ‌ద్ర‌త‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఢిల్లీ సీఎం రేఖ‌గుప్తాపై అహ్మ‌ద్ బాషా అనే వ్య‌క్తి దాడి చేసిన విష‌యం తెలిసిందే. సీఎం అధికార నివాసంలో నిర్వ‌హించిన‌ జ‌న్ స‌వాయ్ కార్య‌క్ర‌మంలో.. సీఎంకు ప‌లు స‌మ‌స్య‌ల‌పై ఆర్జీ పెట్టుకోవ‌డానికి వ‌చ్చి..ఒక్క‌సారిగా ఆమెపై దాడికి య‌త్నించాడు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైనా భ‌ద్ర‌తా సిబ్బంది..యువ‌కుడిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప‌రిణామంతో ఉలిక్కి ప‌డ్డ మోడీ ప్ర‌భుత్వం ఆమె భ‌ద్ర‌తా ప‌ట్ల కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా ఢిల్లీ సీఎంకు CRPF జ‌వాన్ల‌తో కూడిన జెడ్ కేట‌గిరి భ‌ద్ర‌తా క‌ల్పిస్తూ గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

దీంతో ఢిల్లీ సీఎం భద్రతను ఢిల్లీ పోలీసుల నుండి CRPF అధికారులు స్వీకరించనున్నారు. 24 గంటలూ రక్షణ కల్పించడానికి ముఖ్యమంత్రి నివాసంతో పాటు కార్యాలయం చుట్టూ అదనపు భ‌ద్ర‌తాను ఏర్పాటు చేయ‌నున్నారు.

Z-కేటగిరీ భద్రత కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత స్థాయి రక్షణలలో ఒకటి. Z-కేటగిరీలో భాగంగా 20 కంటే ఎక్కువ మంది సిబ్బందితో కూడిన ఎస్కార్ట్, క్లోజ్ ప్రాక్సిమిటీ గార్డులు, డ్రైవర్లు,స్కార్ట్ వాహనాలను కలిగి ఉంటుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad