– రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
– ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు : ధర్మాసనం
న్యూఢిల్లీ: యోగా బాబా రామ్‌దేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హమ్‌దర్ద్ పానీయం విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌పై విచారిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ”ఎవరి నియంత్రణలో లేకుండా ఆయన తన సొంత ప్రపంచంలో జీవిస్తున్నారు” అని పేర్కొంది. ఏప్రిల్ 22న జరిగిన విచారణలో భాగంగా హమ్‌దర్ద్ ఉత్పత్తులపై భవిష్యత్తులో ఎలాంటి ప్రకటనలు జారీ చేయొద్దని, వీడియోలు షేర్ చేయొద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఆ తరహా వ్యాఖ్యలు షాక్‌కు గురిచేశాయని తీవ్రంగా స్పందించింది. అవి ఏమాత్రం సమర్థనీయం కాదని తేల్చిచెప్పింది. గతంలో తప్పుదోవ పట్టించే ప్రకటనల వ్యవహారంలో పతంజలి ఆయుర్వేద్ సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా , ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. ఇకపై అలాంటి యాడ్స్ ఇవ్వబోమని వారు కోర్టుకు విన్నవించారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం.. వారిపై ధిక్కరణ కేసును మూసివేసింది. అయితే, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.
ఎవరి నియంత్రణ లేని సొంత ప్రపంచంలో జీవిస్తున్నారు
- Advertisement -
RELATED ARTICLES