- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్‌కు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించింది. గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రహమాన్, మహ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్‌లకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన నిందితులతో పోలిస్తే ఖాలిద్, ఇమామ్ భిన్నమైన పరిస్థితిలో ఉన్నారని పేర్కొంది. 2020 ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన అల్లర్లకు కుట్రదారులుగా పేర్కొంటూ వీరిపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -



