Sunday, January 11, 2026
E-PAPER
Homeజాతీయంచలికి వ‌ణుకుతున్న ఢిల్లీ

చలికి వ‌ణుకుతున్న ఢిల్లీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఢిల్లీవాసులు చలికి గజగజ వణికిపోతున్నారు. శనివారం ఢిల్లీలో 4.2 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది సీజన్‌ సగటు కంటే 2.7 డిగ్రీలు తక్కువ అని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. 2024లో జనవరి 15 ఉదయం రికార్డు స్థాయిలో 3.3 డిగ్రీల సెల్సియస్‌ కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరలా రెండు సంవత్సరాల తర్వాత ఈ ఏడాది ఈరోజు (2026 జనవరి 10) 4.2 డిగ్రీల సెల్సియస్‌ మేర రికార్డుస్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండి తెలిపింది.

కాగా, ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈవిధంగా ఉన్నాయి. సఫ్దర్‌జంగ్‌లో 4.2 డిగ్రీలు, పాలెం 4.5 డిగ్రీలు, లోథి రోడ్‌ 4.7 డిగ్రీలు, రిడ్జ్‌ స్టేషన్‌ 5.3 డిగ్రీల సెల్సిస్‌, అయానగర్‌ వద్ద 4.5 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గతేడాది డిసెంబర్‌లో 4-5 తేదీల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5.6 డిగ్రీలు, ఈ ఏడాది డిసెంబర్‌1 తేదీన 5.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండి తెలిపింది.
ఢిల్లీలో శనివారం గాలి నాణ్యతలు క్షీణించాయి. శనివారం ఉదయం 9 గంటల సమయంలో ఎక్యూఐ 366 వద్ద నమోదైంది. వీటి స్థాయిల్ని ‘వెరీ పూర్‌’ కేటగిరీ స్థాయిలో వర్గీకరించినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -