నవతెలంగాణ-హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం హస్తినకు వెళ్లనున్నారు. ఉదయం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రూ.100 కోట్లతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. మాచనూర్‌లో రూ.26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. అదేవిధంగా రూ.494.67 కోట్లతో చేపట్టబోయే పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొనున్నారు. అయితే, సమావేశంలో చర్చించనున్న అంశాల ఎజెండాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయా రాష్ట్రానికి చేరవేసింది. తెలంగాణకు అవసరమైన నిధులపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధం చేసింది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎస్ రామకృష్ణా రావు హాజరుకానున్నట్లుగా తెలుస్తోంది. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన వెంటనే ఢిల్లీలోని పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు, ఇతర పర్మీషన్లపై వారితో చర్చించనున్నట్లుగా సమాచారం.
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES