నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు పడిపోయాయి. సోమవారం ఉదయానికి ఢిల్లీలో గాలి నాణ్యతలు 356గా నమోదయ్యాయి. వీటి స్థాయిల్ని ‘వెరీ పూర్’ కేటగిరీలో వర్గీకరించినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) పేర్కొంది. ఇక ఉష్ణోగ్రతలు కూడా 8.7గా నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ఐదు పర్యవేక్షణ కేంద్రాల్లో ఎక్యూఐ స్థాయిలు ప్రమాదకరంగా నమోదయ్యాయి. 29 స్టేషన్లలో వెరీపూర్ కేటగిరిలో నమోదయ్యాయి. నాలుగు స్టేషన్లలో పూర్ కేటగిరీలో నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. నరేలా (405), జహంగిర్‌పూరి (404), వజీర్‌పూర్ (402), రోహిణి (401) కేంద్రాల్లో ప్రమాదకర స్థాయిల్లోనే ఎక్యూఐ స్థాయిలు నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.
మెరుగుపడని ఢిల్లీ గాలి నాణ్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



