- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులో బ్లింకిట్ డెలివరీ బాయ్ ఒక మహిళ ప్రాణాలను కాపాడాడు. రాత్రి సమయంలో ఎలుకల మందు ఆర్డర్ చేసిన మహిళ ఏడుస్తూ కనిపించడంతో, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని భావించి, డెలివరీ బాయ్ ఆ ఆర్డర్‌ను రద్దు చేశాడు. ఈ సంఘటనను అతను సోషల్ మీడియాలో పంచుకోగా, నెటిజన్లు అతనిని ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.
- Advertisement -



