నవతెలంగాణ-హైదరాబాద్: డెలివరీ బాయ్స్ దేశవ్యాప్తంగా తమ ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా మరియు ఇతర సౌకర్యాలను కోరుతూ స్విగ్గీ, జోమాటో వంటి గిగ్-ఎకామర్స్ ఫ్లాట్‌ఫారమ్‌లకు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నిరసనకు కారణంగా, డిసెంబర్ 25 (క్రిస్మస్) మరియు డిసెంబర్ 31 (న్యూ ఇయర్) రోజుల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో ఫుడ్ డెలివరీ సేవలు నిలిచిపోవనున్నాయి. తెలంగాణలో కూడా గిగ్ & ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ సమన్వయంతో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ బంద్‌కు పిలుపునిచ్చింది.
డెలివరీ బాయ్స్ ప్రధాన డిమాండ్లు..న్యాయపరంగా వేతనాలు ఇవ్వాలి.పని ప్రదేశంలో భద్రత, గౌరవం, సామాజిక భద్రత కల్పించాలి. “10 నిమిషాల్లోనే డెలివరీ” అనే నిబంధనను తొలగించాలి, ఎందుకంటే దీని వల్ల ఒత్తిడి పెరుగుతుంది.హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలను అందించాలి.విశ్రాంతి సమయాలు, సాంకేతిక లోపాలు లేకుండా బిల్లు చెల్లింపులు వంటి సౌకర్యాలను కల్పించాలి.పెన్షన్, ఇతర భవిష్యత్ సురక్షా సౌకర్యాలను కూడా అందించాలి.



