Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్ప్రజలందరి భాగస్వామ్యంతోనే డెంగ్యూ నియంత్రణ

ప్రజలందరి భాగస్వామ్యంతోనే డెంగ్యూ నియంత్రణ

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్ 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవంను శుక్రవారం స్థానిక సీతారాం నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో జిల్లా మలేరియా అధికారి జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతారాం నగర్ కాలనీ వీదుల్లో దోమల నివారణ పై మనందరి పంతం డెంగీ అంతం, చిన్న ప్రాణులు పెద్ద ప్రమాదం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి, నీటి నిల్వలను తొలగించండి, దోమతెరలను వాడండి, దోమలు పుట్టకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి, అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తిరిగి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని అక్కడ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం నినాదంగా పరిసరాలను పరిశీలించండి, శుభ్రపరచండి, మూతలు పెట్టడం ద్వారా డెంగిని నివారించుదాం అని ఇవ్వడం జరిగిందన్నారు. దానికోసం క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి ప్రతిరోజు వెళ్లిన సందర్భంలో ఆశాలు, ఏఎన్ఎంలు ప్రతి ఇంటి వద్ద పరిసరాలను పరిశీలిస్తూ పరిసరాలను పరిశుభ్రపరుచుకోనే విధంగాఅవగాహన కలిగిస్తూ నీటి నిల్వలను తొలగిస్తూ మూతలు పెట్టడం లాంటి అలవాట్లను ప్రతి గృహంలో అవగాహన కలిగించాలన్నారు.
డెంగ్యూ వ్యాధి ఈడీస్ ఇజిప్సీ అనే దోమ కుట్టడం వలన వస్తుందని దీనిని టైగర్ దోమ అని కూడా అంటారని ఇది పగటిపూట కుడుతుందని అన్నారు. మూడు దోమల ద్వారా ఐదు రకాల వ్యాధులు వ్యాపిస్తాయన్నారు వీటిలో డెంగీ అత్యంత ప్రమాదకరమైందని డెంగీ లక్షణాలు ఉన్నట్లయితే మీ దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తగిన వైద్య పరీక్షలు చేసుకుని చికిత్స పొందాలని తెలియజేశారు. డెంగ్యూ వ్యాధిని ఎలీషా పరీక్ష ద్వారా నిర్ధారణ చేయవచ్చు అన్నారు. డెంగ్యూ వ్యాధి చికిత్స పట్ల ప్రజల్లో మూఢనమ్మకాలు ఉన్నాయని వాటిని తొలగించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. దోమలు పుట్టకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాల న్నారు.ప్రతి ఇంటి వద్ద పరిసరాలను పరిశీలిస్తూ ,నీటి నిల్వలను తొలగిస్తూ, ప్లాస్టిక్ ని నివారిస్తూ, అన వసరమైన ఖాళీ డబ్బాలు ,ప్లాస్టిక్ కవర్లు ,పాత టైర్ లలో ,కొబ్బరి చిప్పలు, గ్లాసులు ఏవి కూడా ఇంటి వద్ద పరిసరాల్లో ఉండకుండా ప్రతి శుక్రవారం తొలగించాలని నీటి నిల్వలని పారపోస్తూ, కడిగి, ఎండబెట్టి మరలా వాటిని వాడుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేనీ విధిగా పాటించాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో వివిధ శాఖల సమన్వయంతో అందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రజలందరినీ దోమల నివారణలో భాగస్వామ్యం చేసేలా అవగాహన కలిగించాలన్నారు. దోమల నివారణ, కీటక జనిత వ్యాధుల నివారణ వైద్యశాఖ ఒకరే కాకుండా ప్రజలందరూ భాగస్వాములైనప్పుడే కీటక జనత వ్యాధులను డెంగీ లాంటి వ్యాధిని నివారించవచ్చు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ నవ్య, మాలపల్లి పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సహిస్తాహిర్దోష్, ఏ ఎం ఓ సలీం ,జిల్లా ఆరోగ్య విద్య బోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు, సబ్ యూనిట్ అధికారి గోవర్ధన్, హెచ్ ఇ ఓ లు నటరాజ్, రవిచందర్, పర్యవేక్షణ అధికారులు సుశీల శ్యామల, ఆరోగ్య కార్యకర్తలు మధుసూదన్, స్వామి, శశిరేఖ, సుశీల ,కవిత, సంగీత, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -