Monday, December 15, 2025
E-PAPER
Homeజాతీయంద‌ట్ట‌మైన పొగ‌మంచు.. విమాన రాక‌పోక‌లు ఆల‌స్యం

ద‌ట్ట‌మైన పొగ‌మంచు.. విమాన రాక‌పోక‌లు ఆల‌స్యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఒక‌వైపు గాలి కాలుష్యం, మ‌రోవైపు పొగ‌మంచు ఢిల్లీ వాసుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో రోజురోజుకు పెరిగిపోతున్న గాలి కాలుష్యంతో పాటు ప్ర‌యాణం క‌ష్టాలు ఎక్కువ అవుతున్నాయి. ద‌ట్ట‌మైన పొగ‌మంచు కార‌ణంగా విజిబులిటీ పడిపోవడంతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. సోమవారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర భారతదేశానికి భారీ పొగమంచు అలర్ట్‌ జారీ చేసింది.

అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని విమానాలు మార్గం మళ్లించబడ్డాయి. విమాన ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -