- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు (Dense Fog) కమ్మేసింది. దీంతో విజిబిలిటీ జీరోకు పడిపోయింది. దీంతో రోడ్డు, రైలు, వాయు రవాణా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇవాళ ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే వందకు పైగా విమానాలు రద్దయ్యాయి. పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దాదాపు 118 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అందులో 60 అరైవల్స్ కాగా, 58 డిపార్చర్స్ ఉన్నాయి. మరో 16 విమానాలను అధికారులు దారి మళ్లించారు. పొగ మంచు పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక అడ్వైజరీ జారీ చేసింది.
- Advertisement -



