Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మధ్యాహ్న భోజనం పట్ల డీఈఓ తప్పుడు ప్రచారం మానుకోవాలి

మధ్యాహ్న భోజనం పట్ల డీఈఓ తప్పుడు ప్రచారం మానుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ను ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ.. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్  మధ్యాహ్న భోజనం పట్ల తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 6 రూపాయల 78 పైసలు, హై స్కూల్ విద్యార్థుల గుడ్డుతో కలిపి 13 రూపాయల 17 పైసలు పెంచుతూ నిర్ణయం చేయడం జరిగిందని, ఇది అక్టోబర్ నెల నుండి అమల్లోకి వస్తుందని, కానీ ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం 13 రూపాల్లో రెండు కూరగాయలు పప్పు కోడిగుడ్లు పెట్టడం సాధ్యం కాదని 22 రూపాయలు ఇస్తే ప్రభుత్వం మెనూ అమలు చేయడం సాధ్యమవుతుందని అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కమిషనర్ గారికి జిల్లా అధికార యంత్రాంగానికి వినతి పత్రాలు సమర్పించడం జరిగిందన్నారు.

కానీ ఆ వినతిపత్రాల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ మెనూ చార్జీలు పెంచకుండా పేద బలహీన వర్గాల కార్మికులు ఇంట్లో పస్తులున్న పాఠశాలలో విద్యార్థులకు భోజనం పెట్టడం జరుగుతుందని, ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులను వంటకు దూరం చేయటం కోసం ప్రజల్లో తప్పుడు సంకేతాలనుస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు కూరగాయలు పప్పుతో పాటు ఉడకబెట్టిన నూనెలో వేయించిన గుడ్లు పెట్టాలని నెలకు నాలుగు సార్లు మటన్ చికెన్ పెట్టాలని ప్రచారం చేయడం సరికాదన్నారు. బహిరంగ మార్కెట్లో 900 రూపాయల కిలో మటన్, 300 పైన కిలో చికెన్ ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే 13 రూపాయలను ఏ రకంగా కార్మికులు వంట చేసి పెడతారని ప్రశ్నిస్తున్నామన్నారు. కాబట్టి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కార్మికుల పైన ఒత్తిడి తీసుకొచ్చి కార్మికులను వంటకు దూరం చేసే కుట్రలు సరికాదని ఇప్పటికే అనేక పాఠశాలలో హెడ్మాస్టర్ ల ద్వారా కొంతమంది వారికి సంబంధించిన వ్యక్తుల ద్వారా ఒత్తిడి తెచ్చి కార్మికులను తొలగిస్తున్నారని ఈ విధానాన్ని మానుకోకపోతే ఏఐటీయూసీగా డీఈఓ కార్యాలయం ముట్టడికైనా సిద్ధపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి చక్రపాణి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి హనుమాన్లు, మధ్యాహ్న భోజన నాయకురాలు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -