Monday, January 12, 2026
E-PAPER
Homeనిజామాబాద్సీఐ సత్యనారాయణపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి

సీఐ సత్యనారాయణపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి

- Advertisement -
  • ఎమ్మార్పీఎస్ డిమాండ్
    నవతెలంగాణ-కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం, మచ్చర్ల గ్రామానికి చెందిన పచ్చుక రాజేశ్వర్ అనే మాదిగ యువకుడి మీద అకారణంగా పోలీస్ స్టేషన్‌లోచిత్ర హింస‌ల‌కు గురి చేశార‌ని, సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను బాధితునితో కలిసి జిల్లా ఎమ్మార్పీఎస్ కమిటీ కలిసి ఆర్మూర్ సీఐ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సీపీ కూడా సానుకూలంగా స్పందించార‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు సరికేల పోశెట్టి మాదిగ, ఎం ఈ ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు తెడ్డు గంగారాం మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ మదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు గంధమల నాగభూషణ్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకులు పెద్దోళ్ల యమున మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లాసిన్గారి భూమయ్యా మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు తెడ్డు రవికిరణ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు పెద్దిగారి మహేష్ మాదిగ, బాధితుడు పచ్చుక రాజేశ్వర్ మాదిగ పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -