నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలోని సుమారు 83 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేఖలు రాశారు. వాటిని విద్యుత్ అధికారులు స్వయంగా వెళ్లి వినియోగదారులకు అందజేస్తున్నారు. భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు.. విద్యుత్ వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగా నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, డిప్యూటీ సీఎం సందేశంతో కూడిన లేఖలను గృహజ్యోతి లబ్ధిదారులు, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు అందజేస్తున్నారు. వినియోగదారుడి పేరు, సర్వీస్ కనెక్షన్ నంబర్‌తో వ్యక్తిగతంగా ప్రస్తావిస్తూ రాసిన ఈ లేఖలను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు స్వయంగా వినియోగదారుల ఇళ్లకు వెళ్లి అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 52,82,498 మంది గృహజ్యోతి లబ్ధిదారులు, 30,03,813 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు ఈ లేఖలు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు.
విద్యుత్ వినియోగదారులకు డిప్యూటీ సీఎం భట్టి లేఖలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



