Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు డిప్యూటీ సీఎం కితాబ్

ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు డిప్యూటీ సీఎం కితాబ్

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: భారతీయ సినిమాకు 50 సంవత్సరాలు అగ్ర కథానాయకుడిగా అందించిన సేవకు గాను నందమూరి బాలకృష్ణకు ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, UK గుర్తింపు లభించింది.ఈ సందర్భంగా బాలయ్య సినీ, రాజకీయ ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా బాలయ్యకు అభినందనలు తెలుపుతూ ‘ బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ,

విభిన్న చిత్రాల‌తో ప్రేక్షకులను మెప్పిస్తూ నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో చోటు సాధించిన ప్రముఖ నటులు, హిందూపురం MLA, పద్మ భూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణకి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ట్వీట్ చేసారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad