నవతెలంగాణ-హైదరాబాద్ : సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ మేరకు పవన్‌కల్యాణ్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. సింహాచలంలో గోడ కూలి క్యూలైన్‌లో ఉన్న భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. భారీ వర్షాలు కారణంగా గోడ కూలిందని అధికారులు చెప్పినట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు పవన్‌కల్యాణ్ సూచించారు.
సింహాచలం దుర్ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ దిగ్భ్రాంతి
- Advertisement -
RELATED ARTICLES