Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంపట్టాలు తప్పిన ప్యాసింజర్ ట్రైన్..

పట్టాలు తప్పిన ప్యాసింజర్ ట్రైన్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తమిళనాడులో ఇవాళ తెల్లవారుజామున ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది. రాణిపేట్ జిల్లాలోని చిత్తేరి రైల్వే స్టేషన్‌లో ఆరక్కోణం-కాట్పాడి ప్యాసింజర్ ట్రైన్ నెం.66057 పట్టాలు తప్పింది. చిత్తేరి స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన కొద్దిసేపటికే ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించింది. దీంతో అప్రమత్తమైన లోకో పైలెట్ ఎమర్జెన్సీ బ్రేకులను అప్లయ్ చేసి ట్రైన్‌ను నిలిపివేశాడు. కిందకు దిగి చూడగా.. ట్రైన్ పట్టాలు తప్పినట్లుగా గుర్తించి ఉన్నతాధికారులకు సమచారం అందజేశాడు.

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం జరగలేదని రైల్వే ఉన్నతాధికారులు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం వల్ల రైలు పట్టాలు విరిగిపోయి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ట్రైన్‌లోని మూడు, తొమ్మిది బోగీలు ఒక పక్కకు పూర్తిగా ఒరిగిపోయాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం రైల్వే సిబ్బంది స్పాట్‌కు చేరకుని ట్రాక్ పునరుద్ధరణ పనులను ముమ్మరం చేశారు. ఆరక్కోణం-కాట్పాడి మధ్య ఎక్స్‌ప్రెస్ రైళ్లను లూప్ లైన్లు, ప్రత్యామ్నాయ ట్రాక్‌ల మళ్లిస్తున్నామని అధకారులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad