- Advertisement -
మాలమహానాడు నాయకుడు దేవయ్య అగ్రహం
నవతెలంగాణ – బెజ్జంకి
152 ఓట్లున్నా..ఎస్సీ సామాజిక వర్గానికి వార్డ్ కేటాయించకుండా అధికారులు వివక్ష చూపారని మాలమహానాడు రాష్ట్ర సాంస్కృతిక చైర్మన్ ఎలుక దేవయ్య సోమవారం అగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్దిరోజుల క్రితం ప్రకటించిన వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియలో మండల పరిధిలోని గుండారం గ్రామ పంచాయతీ వార్డ్ కేటాయింపులో అన్యాయం జరిగితే ఎంపీడీఓకు విపతిపత్రం అందజేశామని..ఆదివారం ప్రకటించిన వార్డ్ రిజర్వేషన్లలో మళ్లీ ఎస్సీ సామాజిక వర్గాలకు ఒక్క వార్డ్ కేటాయించకుండా వివక్ష చూపారని దేవయ్య అసహనం వ్యక్తం చేశారు. ఎస్సీ సామాజిక వర్గాలకు వార్డ్ రిజర్వేషన్లలో ప్రాధాన్యత కల్పించాలని అధికారులను అయన కోరారు.
- Advertisement -



