శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఆశిష్ హీరోగా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న 60వ చిత్రానికి ‘దేత్తడి’ అనే డిఫరెంట్ టైటిల్‌ని ఖరారు చేశారు. ‘రౌడీ బార్సు’, ‘లవ్ మీ’ సినిమాలతో అలరించిన ఆశిష్ నటిస్తున్న ఈ చిత్రంతో నూతన దర్శకుడు ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ వీధుల్లో చోటుచేసుకునే కల్చర్‌తో, భావోద్వేగంతో కూడిన అనుభూతిని ప్రేక్షకులకు అందించనుంది. ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బందం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేసింది. మాస్‌కు నచ్చే స్టయిల్‌లో ‘దేత్తడి’ అనే టైటిల్ పెట్టారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ఆశిష్ హైదరాబాద్ వీధుల్లో కనిపించే డప్పు వాద్యకారుడి గెటప్‌లో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అతని దుస్తులు కూడా అతని క్యారెక్టర్‌ను ప్రజెంట్ చేస్తూ మాస్ ఫీల్‌ను ఇస్తున్నాయి. ఈ సినిమాకు సంగీతం మరో ప్రధాన బలంగా నిలవనుంది. దర్శకుడు స్వయంగా మ్యూజికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాడు కావడంతో సినిమాలో సౌండింగ్ ఇన్నోవేటివ్‌గా ఉండబోతుంది. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది అని మేకర్స్ తెలిపారు.