Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లింకురోడ్ల అభివృద్ధి ప్రజా ప్రభుత్వ లక్ష్యం 

లింకురోడ్ల అభివృద్ధి ప్రజా ప్రభుత్వ లక్ష్యం 

- Advertisement -

ఎమ్మెల్యే కృషితో లింకు రోడ్లకు మహర్దశ 
ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మంజుల
సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం
నవతెలంగాణ-పాలకుర్తి

తండాలతోపాటు ఆవాస ప్రాంతాల లింకు రోడ్ల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్ అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం ప్రభుత్వం 24 కోట్ల 30 లక్షలు మంజూరు చేయడంతో బుధవారం మండల కేంద్రంలో గల రాజీవ్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిల చిత్రపటానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్ లతో కలిసి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ తండాలు, శివారు ప్రాంతాల రోడ్ల ను అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేస్తున్న కృషి ఫలించిందని తెలిపారు. గిరిజనులు ఎమ్మెల్యేకు రుణపడి ఉంటారని అన్నారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు లావుడియా భాస్కర్ నాయక్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు జలగం కుమార్ లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -