Monday, December 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి

ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి

- Advertisement -

నవతెలంగాణ-కందుకూరు : ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్,  పొన్నం  ప్రభాకర అన్నారు.  కందుకూరు మండలం మీరు ఖాన్ పెట్ రెవెన్యూలో ఆదివారం భారత్ ఫ్యూచర్ సిటీ లో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు.   డిజిటల్  సెషన్ హాల్, లను పరిశీలించారు .ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు  సూచన చేసారు. అనంతరం అక్కడే కనువిందు చేస్తున్న ఆర్టీసీ లో మొదటి తరం ఆర్టీసీ బస్సు అయినటువంటి అల్బేన్ నుండి ఎలక్ట్రిక్ బస్సు వరకు ఆర్టీసీ అభివృద్ధి అని ప్రదర్శనగా ఉంచిన ఆర్టీసీ బస్సులను  మంత్రులు ఆసక్తిగా తిలకించారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుందని,  ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి అని చెప్పారు. వారి వెంట  ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, రావణ శాఖ అధికారులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -