– వడ్డెర వృత్తిదారుల సమస్యలను పరిష్కరాం చేయాలి
– వడ్డెర వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు ఇడుగొట్టి సాయిలు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రం లో గురువారం వడ్డెర వృత్తిదారుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నికి అతిథులు వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇడ్డగొట్టి సాయిలు, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ ఎస్, వెంకట్ గౌడ్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో వడ్డెర వృత్తిదారుల సమస్యలపై నిరంతర పనిచేస్తున్నదని అన్నారు. దేశాన్నికి స్వాతంత్య్ర వచ్చి 70 సంవత్సరాలు దాటిన కూడ వడ్డెర సమస్యల ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఉందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చేయడంలో విఫలం చెందారని అన్నారు. గుట్టలు, క్యార్వీలపై పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 4000 వేల సొసైటీలు ఉన్న వడ్డెర వృత్తిదారులకు నిధులు మంజూరు చేయడంలో విఫలం చేందాయని అన్నారు.
50 సంవత్సరాలు నిండిన ప్రతి వడ్డెర వృత్తిదారులకు ఫింఛన్ల మంజూరు చేయాలని అన్నారు. వడ్డెర వృత్తిదారుల లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వడ్డె ఓబన్న జయంతి అధికారికంగా నిర్వహించి, తగ్గినంత నిధులు మంజూరు చేయాలని అన్నారు. వడ్డెర వృత్తిదారులకు ప్రమాదవశాత్తు మరణించిన వారికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, కాల్లు, చేతులు విరిగిపోయిన వారికి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.వడ్డెర వృత్తిదారులకు భీమా సౌకర్యం కల్పించాల్సిన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు మోతిరాం నాయక్, వడ్డెర వృత్తిదారుల సంఘం నాయకులు బాలయ్య, సూరి, రాజా, శ్రీనివాస్, రమేష్ రవీందర్ రవి , సురేష్ , దుర్గయ్య, వెంకటేష్, ప్రణీత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.



