నవతెలంగాణ-అచ్చంపేట
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు , ఎంపీ మల్లురవి ల ఆశీస్సులతో 30 కోట్లతో అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. సీతారాల గుట్ట లో నల్లమల్ల బతుకమ్మ పండుగ ఏర్పాట్లను . ఎమ్మెల్యే పరిశీలించి అనంతరం మాట్లాడారు. పట్టణంలో సీతారాల గుట్ట పరిసర ప్రాంతంలో 7 ఎకరాల లో వైఎస్ఆర్ పార్క్ ఏర్పాటు 8 కోట్లతో రాజీవ్ – ఎన్టీఆర్ మినీ స్టేడియం విస్తరణ పనులు కళాభారతి మొదలైన అభివృద్ధి పనులను అతి త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందన్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మురళి మాజీ ఎంపీపీ రామనాథం తదితరులు ఉన్నారు.
………………..