Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘ‌నంగా దేవి విద్యోదయ విద్యాలయం 23వ వార్షికోత్స‌వం వేడుక‌లు

ఘ‌నంగా దేవి విద్యోదయ విద్యాలయం 23వ వార్షికోత్స‌వం వేడుక‌లు

- Advertisement -

– అల‌రించిన‌ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
– ప్రత్యేక ఆకారక్షణ గా నిచిన విద్యార్థుల నృత్యలు

నవతెలంగాణ – మల్హర్ రావు:-
కొయ్యూరులోని దేవి విద్యోదయ విద్యాలయం 23వ వార్షికోత్స‌వం వేడుక‌లు ఎంతో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌కు ముఖ్యఅథిదిగా రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మేన్ అయిత ప్ర‌కాశ్ రెడ్డి పాల్గోన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌ మాట్లాడుతు.. పిల్ల‌లు చ‌క్క‌గ చ‌దివి ప్ర‌యోజ‌కులు కావాల‌ని,అలాగే పాఠ‌శాల మ‌రింత అబివృద్దిచెందాల‌ని,నాణ్య‌మైన విద్యాను అందించాల‌ని సూచించారు.
క‌ర్స్‌పాండెట్ కుడుదుల రాజు మాట్ల‌డుతు..23సంత్సారాలు పూర్తి చేసుకోని 24వ వార్షికోత్సవంలోకి అడుగిడుతుందని ఈ ప్ర‌యాణానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందన్నారు. ఈ 23సంత్సారాలుగా విద్యార్థులు సాదించిన విజ‌యాల‌ను వివ‌రించారు.
కొయ్యూరు ఎస్ఐ2 రాజన్ మాట్ల‌డుతు.. విద్యార్థులు శ్ర‌ద్ధ‌గా చ‌దువుకోవాల‌ని,చెడు వ్య‌స‌నాల‌జోలికి పోకుండా తల్లిదండ్రుల క‌ష్టాన్ని వృదా చేయ‌కుండా మంచి పేరు తీసుక‌రావాల‌ని కోరారు.

ఈ వేడుకలో విద్యార్థుల సాంస్కృతిక ,నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకారక్షణగా నిలిచాయి. కిండర్ గార్టెన్ గ్రాడ్యుయేషన్ వేడుక యువ గ్రాడ్యుయేట్లకు గర్వకారణంగా నిలిచింది, వారు అతిథుల నుండి ప్రశంసలు, ఆశీర్వాదాలు పొందారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల పిటిఏ అధ్యక్షుడు డి. శ్రీధర్, కొయ్యూర్ సర్పంచ్ కొండన్ రాజమ్మ, ఉప సర్పంచ్ ఎల్. సవేందర్, వ‌ల్లేంకుంట‌ సర్పంచ్ బొమ్మ రజిత ర‌మేష్ రెడ్డి, ఉప సర్పంచ్ కటకం స్వప్న నరేష్, ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -