- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని సంగారెడ్డి(D) కంది(M) మామిడిపల్లికి చెందిన శ్రీనివాసులు (61) కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. లడ్డూలు తీసుకుని మ్యూజియం వైపు వెళ్తుండగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గుర్రప్ప.. శ్రీనివాసులుకు సీపీఆర్, ప్రథమ చికిత్స చేశారు. ఆస్పత్రికి తరలించగా.. ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు వెల్లడించారు.
- Advertisement -