- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో హరిసింగ్ యాదవ్ అనే తహసీల్దార్ షూ వేసుకుని అమ్మవారి గుడిలోకి ప్రవేశించాడు. దీంతో అమ్మవారి పవిత్రతకు భంగం కలిగించాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతడిపై దాడి చేసి.. బట్టలు చింపేశారు. అనంతరం గుడి చూట్లూ ఊరేగించి.. దేవత ముందు అతడితో క్షమాపణ చెప్పించారు. ఈ ఘటనను భక్తులు షూట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. కులు జిల్లా యంత్రాంగం తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -