నవతెలంగాణ-హైదరాబాద్: చార్‌థామ్ యాత్రలో భాగంగా ఆరు నెలల తర్వాత ఆదివారం ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం పుస్కర్ ధామీ ఆలయాన్ని సందర్శించారు. ఆలయాధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేపట్టారు. వేదపండితులు సీఎంకు వేద ఆశీర్వదం అందించారు. భారత జాతి సుభిక్షం ఉండాలని ఆ దేవుని ప్రార్థించానని సీఎం తెలిపారు. అంతకుమందు స్వామివారిని దర్శించుకోవడానికి బద్రీనాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు సౌకర్యాలు కల్పించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి చార్‌ధామ్ యాత్రకు పటిష్టమైన భద్రతను కల్పించారు. చార్‌ధామ్ యాత్ర మార్గాన్ని 15 సూపర్ జోన్‌లు, 41 జోన్‌లు, 217 సెక్టార్‌లుగా విభజించారు. ఈసారి యాత్ర మార్గంలో మొత్తం 624 సీసీటీవీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. తొమ్మిది మంది ఏఎస్‌పీ, డీఎస్పీ స్థాయి అధికారులను యాత్ర మార్గాల్లో మోహరించనున్నారు. కాగా, గతేడాది చార్‌ధామ్ యాత్రలో 48లక్షల మంది పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో ఉండే యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను చార్‌ధామ్‌గా పేర్కొంటారు. హిందువులు ఈ చార్‌ధామ్ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే, ఈ ఆలయాలు ప్రతి ఏటా శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు మూసే ఉంటాయి అక్షయ తృతీయ నాడు గంగోత్రి, ఆ తర్వాత రోజు కేదార్‌నాథ్ ఆలయాలు తెరుచుకున్న విషయం తెలిసిందే.
బద్రీనాథ్‌కు పోటెత్తిన భక్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES