- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మేడారం వనదేవతల దర్శనానికి భక్తజనం పోటెత్తింది. ఆదివారం కావడంతో వేలాది కుటుంబాలు తరలివచ్చాయి. భక్తులు సమ్మక్క–సారలమ్మను దర్శించుకుని, మొక్కులు చెల్లిస్తూ అమ్మవార్లకు బెల్లం నైవేద్యం సమర్పిస్తున్నారు. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్న వాగు సందడిగా మారింది. తాడ్వాయి–మేడారం మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా, భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
- Advertisement -



