- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ : వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహాలు వివిధ రూపాలలో కొలువుదీరాయి. వీటిని కొనుగోలు చేసిన అనంతరం వినాయకుడిని స్వాగతం పలకడానికి యువకులు, భక్తులు వివిధ రకాలుగా స్వాగతం పలకడానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా బాల్కొండ మండల కేంద్రంలోని సి వై ఎస్ యూత్ ఆధ్వర్యంలో గణనాథునికి సాంస్కృతిక పరమైన రీతిలో ఘనంగా స్వాగతం పలికారు. విద్యుత్ దీపాల వెలుగుతో అలంకరించిన గొడుగులు ఉపయోగిస్తూ , బ్యాండ్ మేళం మోగిస్తూ ఘనంగా స్వాగతించారు. ఈ దృశ్యo రాజరికపు వైభవంల ఉండడంతో చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
- Advertisement -