- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ భారీ జరిమానా విధించింది. విమానాల అంతరాయం నేపథ్యంలో రూ.22.2కోట్ల ఫైన్ వేసింది. రూ.50 కోట్ల బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలని ఆదేశించింది. డిసెంబర్‌లో తలెత్తిన ఇండిగో సంక్షోభంపై చర్యలు చేపట్టింది. ఈ సంక్షోభంతో ఎయిర్ పోర్టుల్లో చిక్కుకుని 3 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన DGCA.. విచారణ తర్వాత కీలక అంశాలను వెల్లడించింది.
- Advertisement -



