Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఎయిరిండియాకు DGCA కీలక ఆదేశాలు

ఎయిరిండియాకు DGCA కీలక ఆదేశాలు

- Advertisement -

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్‌: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని బోయింగ్‌ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఎయిరిండియాను ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని పేర్కొంది. అహ్మదాబాద్‌-గాట్విక్‌ ఎయిరిండియా (Air India) విమానం ప్రమాదానికి గురైన దృష్ట్యా.. బోయింగ్‌ 787-8/9కు చెందిన విమానాల్లో మెరుగైన భద్రతా తనిఖీలు చేయాలి. సంబంధిత ప్రాంతీయ డీజీసీఏ కార్యాలయాల సహకారంతో తక్షణమే వీటిని చేపట్టాలి’’ అని ఎయిరిండియాను డీజీసీఏ ఆదేశించింది. విమానాలు బయలుదేరే ముందు ఇంధనం పర్యవేక్షణ, క్యాబిన్‌ ఎయిర్‌ కంప్రెసర్‌, ఎలక్ట్రానిక్‌ ఇంజిన్‌ నియంత్రణ వ్యవస్థ, హైడ్రాలిక్‌ వ్యవస్థ, టేకాఫ్‌ ప్రమాణాల పున:పరిశీలన వంటి తనిఖీలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad