నవతెలంగాణ – నాగార్జునసాగర్
అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ లోని బుద్ధ వనంలో మంగళవారం బుద్ధ వనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో దమ్మ దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దమ్మ దీపోత్సవం సందర్భంగా బుద్ధ వనములోని ప్రధాన ద్వారం అశోక ధర్మ చక్రం నుండి దీప జ్యోతుల కాంతులతో బుద్ధం శరణం గచ్చామి…దమ్మం శరణం. గచ్చామి సంఘం శరణం స్మరణాలతో దీపోత్సవ ర్యాలీని మహా స్తూపం చుట్టూ పరిక్రమ చేసిన అనంతరం ధ్యాన మందిరంలోని బుద్ధుని వద్ద దీపకాంతులను ఉంచి బుద్ధ జ్యోతులను వెలిగించారు. ఈ సందర్భంగా మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ సిద్ధారుడు జ్ఞాన సిద్ధుడై మొదటిసారి కపిల వస్తు నగరానికి వస్తున్న సందర్భంలో కపిలవస్తు పురజనులందరూ జ్ఞాన దీపాలతో బుద్ధునికి ఘనంగా స్వాగతం పలికిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీన దమ్మ దీపోత్సవాన్ని వేడుకగా నిర్వహించుకుంటారు అని తెలిపారు.
అంతేకాకుండా మనల్ని వదిలి వెళ్లిపోయిన మన పూర్వీకులకు ఇదే రోజున వారిని గుర్తు చేసుకుంటూ దీపాలతో ఘనంగా నివాళులు అర్పించే రోజు ఇదేనని ఆయన తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫౌండర్ మరియు చైర్మన్ రత్నదీప్ కాంబ్లే మాట్లాడుతూ దమ్మ దీపోత్సవం బౌద్ధాభిమానులు తోపాటు ప్రజలందరిలో జ్ఞాన జ్యోతులతో పాటు సంతోషాన్ని అందించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బుద్దవనం కంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర, ఆర్ట్ మరియు ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్రావు, బుద్ధవనం డి ఈ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ నజీష్, సాగర్ డ్యాం భద్రత అధికారి శ్రీనివాసరావు, పర్యాటకశాఖ గైడ్ సత్య నారాయణ,నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
బుద్ధ వనములో ఘనంగా దమ్మ దీపోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES