Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'ధర్మచక్రం' ఆడియో విడుదల

‘ధర్మచక్రం’ ఆడియో విడుదల

- Advertisement -

తెలుగు రాజకీయ, సినీ రంగాల్లో సంచలనం సష్టించేందుకు సిద్ధమవుతున్న చిత్రం ‘ధర్మచక్రం’ అని మేకర్స్‌ అన్నారు. ఈ సినిమాను నిస్వార్థ సేవా దక్పథంతో స్థాపితమైన ఎస్‌ఐఎఫ్‌ఎఎ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థను స్థాపించిన వ్యక్తి గత ముప్పై ఏళ్లుగా సొంత ఖర్చులతో ఎవరిపై ఆధారపడకుండా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ధర్మచక్రం’ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. విశ్వ విఖ్యాత నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని మహానాడు పర్వదిన సందర్బంగా ఈ చిత్ర ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ, ‘ఈ సినిమా ఎంతో కష్టపడి, పార్టీ విలువలను కాపాడిన చంద్రబాబు నాయుడు జీవన గాథకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ సినిమా ద్వారా ‘నోటు రుచి మరిగిన వారికి పదవులిస్తే ఓటు విలువ తగ్గుతుందనే’ సందేశాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాం. ధర్మం గెలుస్తుంది అనేది ముఖ్య కథాంశం. అయితే ఈ సినిమాను ఆపాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుంది’ అని అన్నారు. ఈ చిత్రానికి లిరిక్స్‌: వెంకటరమణ పసుపులేటి, సంగీతం: రాజకిరణ్‌, గాత్రం: మాళవిక, రాంకీ, వినాయక్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad