నవతెలంగాణ-కంఠేశ్వర్ : బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నట్లు జేఏసీ జిల్లా ఇన్చార్జ్ మహిపాల్ తెలిపారు. ఈ మేరకు సోమవారం నగరంలోని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడిబాటకు విద్యార్థులు రావాలంటే ఫ్రీ బస్సు వేయాలని, ప్రభుత్వ స్కూల్స్ అన్నిటికీ ఆర్టీసీ బస్సులు కేటాయించాలని, విద్యార్థుల్ని స్కూలుకు తరలించాలని డిమాండ్‌లతో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నేడు తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ డిమాండ్ ను పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సాగర్, ప్రశాంత్, రాజేశ్వర్, లింగ స్వామి, గోపి లు పాల్గొన్నారు.
నేడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES