Monday, September 15, 2025
E-PAPER
Homeజిల్లాలుజిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా

జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్: నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కార్యక్రమంలో ఏఎన్ఎంలను ఆన్‌లైన్‌లో సర్వేలు చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం సరైంది కాదని, వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. సోమవారం ఎన్‌సిడి ఆన్ లైన్ ప్రోగ్రాంలో ఏఎన్‌ఎం లను తొలగించాలనీ డిమాండ్ చేస్తూ ఏఎన్ఎంల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం,యూనియన్ జిల్లా కార్యదర్శి పుష్పలత మాట్లాడుతూ ఏఎన్ఎం లు స్క్రీనింగ్ టెస్ట్ లతో పాటు ఆఫ్ లైన్ సర్వేలు చేయాలని గతంలో ఆదేశించారనీ, అదే పనిని కొనసాగిస్తున్న ఏఎన్ఎం లపై మళ్ళీ ఇప్పుడు అదనంగా ఆన్ లైన్ సర్వేలు చేయాలని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని మండిప‌డ్డారు. ఎన్సిడి బి ప్రోగ్రాం అనేది గ్రామస్థాయిలో జనాభా సర్వే ద్వారా జరుగుతుందనీ, ఇప్పటివరకు ఆప్‌లైన్ ద్వారా నమోదు జరుగుతున్నదనీ, ప్రస్తుతం దీనిని ఆన్లైన్ చేయమని ఆదేశించారని, ఆన్లైన్ కు సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆన్ లైన్ సర్వేల నుండి వారిని మినహాయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏఎన్ఎం లకు ఎంతో పని భారం ఉందనీ, ఒక రోజుకు కనీసం 10 నుండి 12 ఇండ్లకు వెళ్లి పరీక్షలు చేయాలని ఆదేశాలు ఉన్నాయని, మళ్ళీ ఆన్ లైన్ సర్వేలు లాంటి అదనపు పనులు మోపడం వల్ల గ్రామాల్లో మాతా శిశు ఆరోగ్య సేవలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్సిడి ప్రోగ్రామును ప్రత్యేక సిబ్బందిచే నిర్వహించబడేలా చూడాలని జిల్లా కలెక్టర్ , జిల్లా వైద్యాధికారి కి వేరువేరుగా వినతి పత్రాలు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -