నవతెలంగాణ – హైదరాబాద్: బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ఎంఎస్‌డీ అజేయంగా 18 పరుగులు చేశారు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే మరే ఇతర ఆటగాడు సాధించని ప్రత్యేకమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో 100 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. మహీ ఇప్పటికే అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా… ఇప్పుడు అతను 100 సార్లు నాటౌట్ అనే మైలురాయిని కూడా సాధించాడు. మొత్తం 241 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. కాగా, ఈ జాబితాలో ధోనీ తర్వాత రెండో స్థానంలో సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఉన్నాడు. అతను 80 సార్లు నాటౌట్‌గా నిలిచాడు.
చరిత్ర సృష్టించిన ధోనీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES